Advertisement

పర్యాటకుల కొరకు వాటర్ ట్యాక్సీ ఏర్పాటు ...

By: chandrasekar Mon, 19 Oct 2020 2:58 PM

పర్యాటకుల కొరకు వాటర్ ట్యాక్సీ  ఏర్పాటు ...


రోడ్డు ప్రయాణాల్లో భాగంగా ట్యాక్సీల గురించి విన్నాం, అయితే ఇక మనం వాటర్ ట్యాక్సీ గురించి వింటాం. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఈ తరహా ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానీ ఈ వాటర్‌ ట్యాక్సీలేంటని అనుకుంటున్నారా? పడవ ప్రయాణాలు చేసే ప్రజలు, పర్యాటకుల కోసం కేరళ మొట్టమొదటి సారిగా ఈ ట్యాక్సీలను ప్రారంభించింది.

ప్రయాణీకుల సౌకర్యార్థం అలప్పుజ, ఫెర్రిడ్‌ బ్యాక్‌ వాటర్‌లో దీనిని ప్రారంభించారు.ఈ ట్యాక్సీ సేవలలో కాటమెరన్‌ డీజిల్‌ పవర్డ్‌ క్రాప్ట్‌లను ఉపయోగించనున్నారు. వీటిలో పదిమంది ప్రయాణించవచ్చు. స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ సేవలలో ప్రస్తుతం నాలుగు క్రాప్ట్‌లను ఉపయోగించాలని ప్రణాళికలు వేస్తోంది. సేవలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరవాత క్రాప్ట్‌లను ఆర్డర్‌ చేసింది ఎస్‌డబ్ల్యూటీడీ.

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటంతో పాటు, అలప్పుజ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ, ప్రయాణాల కోసం పడవలపై ఆధారపడే వారికీ ఈ వాటర్‌ ట్యాక్సీల సేవలు అందుబాటులో ఉంటాయి. కేరళలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రదేశాలలో అలప్పుజ బ్యాక్ వాటర్‌ ప్రాంతం ప్రసిద్ధి గాంచిందని తెలిసిందే.

Tags :
|
|

Advertisement