Advertisement

వార్నర్ టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేస్తాడు

By: Sankar Sun, 21 June 2020 8:34 PM

వార్నర్ టాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేస్తాడు



కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్లు లేక ఖాళీగా ఉన్న క్రికెటర్లు సోషల్ మీడియాలో అభిమానులను అలరించారు ..ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చేసిన సందడి అంత ఇంతా కాదు ..తెలుగు సినిమా పాటలకు డాన్సులు వేస్తూ టిక్ టాక్ లో హల్చల్ చేసిన వార్నర్ ఒక్కసారిగా తెలుగు రాష్టాల్లో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు ..ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాట్స్‌మేన్, ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్ అయిన వీవీఏస్ లక్ష్మణ్ వార్నర్‌పై ఓ సెటైర్ వేశాడు.

వార్నర్ త్వరలోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యం లేదని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌పై స్టీవ్ స్మిత్ కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. వార్నర్ ఇండియా కాంప్‌కు ఎన్నికయినా కాకపోయినా టాలీవుడ్ సినిమాలో చాన్స్ అయితే దక్కించుకుంటాడని స్మిత్ అన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్యూలో వీవీఏస్ లక్ష్మణ్, స్టీవ్ స్మిత్ వార్నర్‌పై తమ అభిప్రాయాలను తెలియచేశారు. త్వరలో తాను కూడా టిక్ టాక్‌లో దర్శనమిచ్చే అవకాశం ఉందని స్మిత్ చెప్పాడు..వార్నర్ , స్మిత్ బాల్ టాంపరింగ్ వలన ఏడాది పాటు క్రికెట్ కు దూరమై అభిమానులకు కూడా దూరామయ్యరు ..ఈ కరోనా వలన వార్నర్ మల్లి తన అభిమానులను తిరిగి సంపాదించుకున్నాడు

Tags :
|
|
|
|

Advertisement