Advertisement

  • వార్నర్ గాయంపై బోల్డ్ కామెంట్స్ చేసిన వార్నర్ భార్య

వార్నర్ గాయంపై బోల్డ్ కామెంట్స్ చేసిన వార్నర్ భార్య

By: Sankar Tue, 01 Dec 2020 9:03 PM

వార్నర్ గాయంపై బోల్డ్ కామెంట్స్ చేసిన వార్నర్ భార్య


ఇండియా , ఆస్ట్రేలియా మధ్య మూడు వన్ డే ల సిరీస్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న విషయం తెలిసిందే ..ఈ సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా మొదటి రెండు వన్ డే లు గెలిచి సిరీస్ గెలుచుకుంది...అయితే సిరీస్ గెలుచుకున్న ఆనందం లో ఉన్న ఆస్ట్రేలియాకు వార్నర్ గాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది..అయితే వార్నర్ గాయంపై వార్నర్ భార్య బోల్డ్ గా స్పందించింది...

మేము ఐపీఎల్ కారణంగా 4 నెలల తర్వాత కలిసాము. కాబట్టి ఈ మ్యాచ్‌కు ముందు మేము లైంగికంగా కలుసుకున్నాము. ఆ కారణంగానే అతనికి గాయమైందని ఓ రేడియో షోలో సరదాగా చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలకు ఆ రేడియో హోస్ట్ స్పందిస్తూ.. ‘నీ వల్లే వార్నర్‌కు గాయమైంది. నువ్వు క్రికెట్ ఆస్ట్రేలియాకు తీవ్ర నష్టం చేశావ్' అని నవ్వుతూ అన్నాడు.

దానికి క్యాండిస్ మళ్ళీ సరదాగా సారీ ఆస్ట్రేలియా అంటూ బదులిచ్చింది. అయితే తాజాగా వార్నర్ కు నొప్పి ఎక్కువగా ఉన్న కారణంగా అతను డిసెంబర్ 17 న ఈ రెండు జట్ల మధ్య జరగనున్న డే-నైట్ మ్యాచ్ లో ఆడటం కూడా అనుమానమే అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు.

Tags :
|
|

Advertisement