Advertisement

గాలిలో నడిచిన వార్నర్ ..వైరల్ అవుతున్న వీడియో

By: Sankar Mon, 01 June 2020 3:35 PM

గాలిలో నడిచిన వార్నర్ ..వైరల్ అవుతున్న వీడియో

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మైదానంలోకి దిగితే.. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడం అలవాటు. లాక్‌డౌన్‌లో బ్యాటు పట్టే అవకాశం లేకపోవడంతో మొబైల్‌ పట్టాడు. ఇక సోషల్‌ మీడియాలో బ్యాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబ సమేతంగా వీడియోలు చేయడం, అభిమానులను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు. వార్నర్‌ వినోదాన్ని పంచినట్లు మరే క్రికెటర్‌ పంచలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకవైపు లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తూనే.. మరొకవైపు అభిమానులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తున్నాడు.

టిక్‌టాక్‌లో డేవిడ్‌ వార్నర్ చేసిన వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. భాష రాకున్నా.. లిప్ ‌సింక్‌తో అన్నింట్లోనూ అదరగొడుతున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమా డైలాగులు, పాటలకు తనదైన నటన జోడిస్తున్న డేవిడ్ వార్నర్ ఆ వీడియోల్లో తన సతీమణి క్యాండిస్‌ను కూడా ఆహ్వానిస్తున్నాడు. దీంతో పలు వీడియోల్లో ఇద్దరూ కలిసి చిందులేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వార్నర్‌ దంపతులు శనివారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్‌ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని 'మైండ్‌బ్లాక్'‌ పాటకు చిందులేశారు.


warnar,tiktok,australia,srh,lockdown ,డేవిడ్‌ వార్నర్,  లాక్‌డౌన్‌, టిక్‌టాక్, క్యాండిస్,  మైండ్‌బ్లాక్

ఇక ఆదివారం డేవిడ్ వార్నర్‌ మరో వీడియోతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ట్రెడ్‌మిల్‌ మీద నడుస్తున్నట్లుగానే గాల్లో నడవడం ఆశ్చర్యకరంగా కనిపిస్తున్న వీడియోను పోస్టు చేసాడు. 'ఈ బద్దకమైన ఆదివారం నాడు చిప్స్‌ తింటూ.. గ్రావిటి ఛాలెంజ్'‌ అని పేర్కొన్నాడు. ఇది పోస్టు చేసిన గంటకే సుమారు రెండు లక్షల మంది లైక్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags :
|
|
|

Advertisement