Advertisement

  • సూపర్ స్టార్ మహేష్ పాటతో అభిమానులను అలరించిన వార్నర్..

సూపర్ స్టార్ మహేష్ పాటతో అభిమానులను అలరించిన వార్నర్..

By: Sankar Mon, 25 May 2020 4:58 PM

సూపర్ స్టార్ మహేష్ పాటతో అభిమానులను అలరించిన వార్నర్..

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ సమయాన్ని పూర్తిగా టిక్ టాక్ వీడియోల కోసం ఉపయోగించుకుంటున్నాడు ..ఐపీయల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలో దిగే వార్నర్ , టిక్ టాక్ లో తెలుగు వీడియోలు చేస్తూ, తెలుగు అభిమానులను బాగా అలరిస్తున్నాడు ...తాజాగా మరొక తెలుగు వీడియోతో అభిమానులను అలరించాడు ..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీ లోని మైండ్ బ్లాక్ పాటలో 'వాడిని కొట్ట‌మ‌ను డప్పూ' వ్యాఖ్యకు సంబంధించిన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.

'ఇంట్లో షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే' బై బై చెప్పేశా అని పేర్కొంటూ ట్వీట్ చేశారు వార్నర్. ఈ మేరకు ఆయన షేర్ చేసిన ఆ వీడియోలో బ్యాటింగ్ చేస్తూనే అలా మాయమైపోవడం నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీప్ ఇట్ అప్ డేవిడ్ వార్నర్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.

Tags :

Advertisement