Advertisement

  • వార్నర్ మైదానంలోనే కాదు డాన్సుల్లో కూడా అదరగొడుతున్నాడు ..అనిల్ రావిపూడి

వార్నర్ మైదానంలోనే కాదు డాన్సుల్లో కూడా అదరగొడుతున్నాడు ..అనిల్ రావిపూడి

By: Sankar Sat, 30 May 2020 5:08 PM

వార్నర్ మైదానంలోనే కాదు డాన్సుల్లో కూడా అదరగొడుతున్నాడు ..అనిల్ రావిపూడి

ఐపీయల్ ప్రారంభం అయిన దగ్గరి నుంచి అన్ని దేశాల ఆటగాళ్ల మధ్య స్నేహపూరిత వాతావరణం మొదలయింది ..ప్రతి సంవత్సరం దాదాపు రెండు నెలల పాటు ఐపీయల్ కోసం ఇండియా వచ్చి ఉండటంతో ఇక్కడ ప్రజలతో కూడా క్రికెటర్లు విడదీయలేని బంధాన్ని ఏర్పరుచుకున్నారు ..దానికి ఉదాహరణ డేవిడ్ వార్నర్ ..ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు అయిన డేవిడ్ వార్నర్ ఐపీయల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున బరిలో దిగుతున్నాడు ..దీనితో ఇక్కడి ప్రజలతో మంచి బంధం ఏర్పరుచుకున్న వార్నర్ , ఈ లాక్ డౌన్ టైం లో టిక్ టాక్ వీడియోల ద్వారా తెలుగు అభిమానులను పలకరిస్తూనే ఉన్నాడు ..

తాజగా వార్నర్ టిక్ టాక్ వీడియోల పై స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తూ ఎప్పుడూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో అదరగొట్టే డేవిడ్ వార్నర్.. ఈ ఏడాది వార్నర్ టిక్‌టాక్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ‌టీపీఎల్)లో సత్తా చాటుతున్నాడని పేర్కొన్నాడు. అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాలోని `మైండ్‌బ్లాక్` పాటకు వార్నర్ తాజాగా తన భార్యతో కలిసి చిందులేసిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోపై దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. `ఈ ఏడాది ఐపీఎల్ లేకపోయినా డేవిడ్ వార్నర్ మనకు వినోదాన్ని అందిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మన తెలుగు వారి కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) కాస్తా వార్నర్ టిక్‌టాక్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ‌టీపీఎల్)గా మారిపోయింది. కాండీ ఫాల్జోన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు. మీ డ్యాన్స్‌కు టేక్ ఏ బౌ. రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నా వార్నర్` అంటూ అనిల్ ట్వీట్ చేశాడు.



Tags :
|

Advertisement