Advertisement

  • రికార్డు కొట్టిన వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్‌

రికార్డు కొట్టిన వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్‌

By: chandrasekar Mon, 01 June 2020 10:33 PM

రికార్డు కొట్టిన వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్‌


ముందస్తు ఆస్తి పన్ను వసూళ్లలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ రికార్డు సృష్టించింది. 2020-21 సంవత్సరానికి ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటించింది. ఈ 5 శాతం రాయితీని ప్రజల్లోకి తీసుకెళ్లి రూ.20.06 కోట్లు ఆస్త్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. చివరి రోజు ఆదివారం 1.16 కోట్లు వసూలు చేశారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య ముందస్తుగా ఆస్తి పన్ను రూ.68,427 చెల్లించారు. గత ఏడాది (2019-20) కూడా ముందస్తుగా రూ.12 కోట్లు వసూలు చేసి రాష్ట్రస్థాయిలో గ్రేటర్‌ వరంగల్‌ మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది కష్టపడి రూ.20.06 కోట్లు ముందస్తు పన్నులు వసూలు చేయడంతో కమిషనర్‌ పమేలా సత్పతి అభినందనలు తెలిపారు. అందువల్ల గ్రేటర్ గా నిలిచిన వరంగల్.

Tags :

Advertisement