Advertisement

  • వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు

వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు

By: chandrasekar Sat, 23 May 2020 7:06 PM

వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు


వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన నరేందర్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు పెట్టారు. ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారని వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ హరీశ్ శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన నియోజకవర్గంలోని 25 డివిజన్లలో ఉన్న పేదలకు సరకులు పంపిణీ చేసే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని హరీశ్ శంకర్ ఫిర్యాదు చేశారు. గతంలో ఆరెంజ్ జోన్‌లో పర్యటించినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారని హరీశ్ శంకర్ గుర్తు చేశారు. సుమారు 3 వేల మంది ఒకే చోట ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కనీసం భౌతిక దూరం పాటించలేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీజేపీ నేత హరీశ్ శంకర్ పోలీసులకు సమర్పించారు. వీటిని ఆధారంగానే పోలీసులు కేసు నమోదు పెట్టారు. ప్రజంతా చాలా దగ్గరగా నిల్చొని ఉన్నారని అక్కడ భౌతిక దూరం ఏమాత్రం లేదని అన్నారు.

Tags :

Advertisement