Advertisement

  • భారత క్రికెట్ ను ధోని మరొక స్థాయికి తీసుకెళ్లాడు ..వకార్ యూనిస్

భారత క్రికెట్ ను ధోని మరొక స్థాయికి తీసుకెళ్లాడు ..వకార్ యూనిస్

By: Sankar Mon, 06 July 2020 6:44 PM

భారత క్రికెట్ ను ధోని మరొక స్థాయికి తీసుకెళ్లాడు ..వకార్ యూనిస్



టీమిండియా దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని మీద ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ ..రాంచి లాంటి ఒక మాములు ప్రాంతం నుంచి వచ్చి కెప్టెన్‌గా భారత్‌కి రెండు ప్రపంచకప్‌లు అందించిన తీరు అమోఘమని వకార్ చెప్పుకొచ్చాడు. క్రికెటర్‌గానే కాకుండా.. ధోనీ ఓ మంచి వ్యక్తి అని కితాబిచ్చిన పాక్ మాజీ క్రికెటర్.. ఫ్యామిలీకి తగినంత సమయం అతను కేటాయించడాన్నికొనియాడాడు.

టీమిండియా కెప్టెన్ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వకార్ యూనిస్ మాట్లాడుతూ ‘‘భారత క్రికెట్‌ జర్నీలో కొత్త పోకడలకి సౌరవ్ గంగూలీ బీజం వేయగా.. ధోనీ ఆ జర్నీని మరో స్థాయికి తీసుకెళ్లాడు. వాట్ ఎ ప్లేయర్.. అతని కెప్టెన్సీని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. పరిస్థితుల్ని చక్కగా ఆకళింపు చేసుకోగల నాయకుడు అతను. అంతకు మించి మంచి వ్యక్తి. ఓ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి పెద్ద దేశానికి చెందిన క్రికెట్ జట్టుని కెప్టెన్‌గా సుదీర్ఘకాలం నడిపించడం అంటే అంత సులువు కాదు. దేశానికి ఆడుతూనే ఫ్యామిలీకి ధోనీ తగినంత సమయం కేటాయించడం ప్రశంసనీయం’’ అని వకార్ యూనిస్ వెల్లడించాడు.

2004లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మహేంద్రసింగ్ ధోనీ.. తన పవర్ హిట్టింగ్‌తో అనతికాలంలోనే ఫినిషర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 2007లో టీ20 కెప్టెన్సీ పగ్గాలు చేతికిరాగా.. దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాని ధోనీ విజేతగా నిలిపాడు. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ద్వారా.. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన ఘనతని సొంతం చేసుకున్నాడు.

Tags :
|
|
|

Advertisement