Advertisement

కరోనా ను కూడా లెక్క చేయని బీహార్ ఓటర్లు...

By: Sankar Wed, 28 Oct 2020 10:29 PM

కరోనా ను కూడా లెక్క చేయని బీహార్ ఓటర్లు...


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ ముగిసింది. ఐదు గంటల వరకూ లెక్క ప్రకారం అయితే 52.24%శాతం పోలింగ్‌ నమోదయ్యయింది. మొదటి దశలో 6 జిల్లాల్లోని 71 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

కరోనా నిబంధనల మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్‌లో కరోనా యాక్టివ్ కేసులు దాదాపు పది వేలు ఉన్నా ప్రజలు లెక్కచేయకుండా.. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ లో భారీగా పాల్గొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గరా ఉదయం నుంచే ఓటర్లు బారులుతీరి కనిపించారు. ఓటింగ్‌లో మాస్క్ తప్పనిసరి చేశారు. వచ్చిన ఓటర్లందరినీ థెర్మల్ స్క్రీనింగ్ చేశారు.

కరోనా లక్షణాలు ఉన్న వారు, 80 ఏళ్లకు పైబడిన వారు పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. అయితే గతంలో కంటే ఈసారి వోటింగ్ పెరుగుతుందని చెప్పాలి ఎందుకంటే 2015, మొదటి దశ ఎన్నికల్లో 54.94%, పోలవ్వగా మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో 53.54% పోలయ్యాయి. ఈరోజు ఆరు గంటలకి క్యూలో ఉన్నవారిని కూడా వోట్ వేయడానికి అనుమతించారు. ఈలెక్కన గతంలో కంటే ఈ వోటింగ్ శాతం పెరగడం ఖాయం అనే చెప్పాలి.

Tags :
|

Advertisement