Advertisement

  • పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు..65 ఏళ్లు పైబడిన ఓటర్లకు వద్దు...సీపీఐ

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు..65 ఏళ్లు పైబడిన ఓటర్లకు వద్దు...సీపీఐ

By: chandrasekar Tue, 07 July 2020 6:31 PM

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు..65 ఏళ్లు పైబడిన ఓటర్లకు వద్దు...సీపీఐ


65 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు కల్పించడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) వ్యతిరేకించింది. ఇది స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియకు హాని చేస్తుందని ఆ పార్టీ అభిప్రాపడింది. అలాగే, రాజకీయ పార్టీలు డిజిటల్‌ ప్రచారం చేసుకోవాలనే నిర్ణయాన్ని కూడా తాము వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాకు రాసిన లేఖలో ఆ పార్టీ నాయకుడు డీ రాజా పేర్కొన్నారు.

కరోనావైరస్ సృష్టించిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని న్యాయ మంత్రిత్వ శాఖ ఎలక్షన్ కోడ్ రూల్ 1961 ను సవరించి, 65 ఏళ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించిందని రాజా చెప్పారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు బీహార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశంలో పాల్గొన్నప్పుడు, డిజిటల్ ప్రచార ప్రతిపాదనను సీపీఐ వ్యతిరేకించింది.

డిజిటల్ ప్రచారం చాలా ఖర్చుతో కూడుకున్నదని ఆ పార్టీ పేర్కొంది. ఈ రెండు ప్రతిపాదనలు అంగీకరిస్తే స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల ప్రజాస్వామ్య ప్రక్రియను ఖచ్చితంగా దెబ్బతీస్తాయి’ అని డీ రాజా అభిప్రాపడ్డారు. ఈ ప్రతిపాదనలను అమలు చేసేందుకు ఏకపక్షంగా ముందుకు వెళ్లవద్దని ఆయన పోల్ ప్యానల్‌ను కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత, పారదర్శక సంప్రదింపులు ప్రారంభించాలని తమ పార్టీ తరఫున అభ్యర్థిస్తున్నామన్నారు.

Tags :
|
|

Advertisement