Advertisement

  • అభివృద్ధికి ఓటేయండి: టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు...

అభివృద్ధికి ఓటేయండి: టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు...

By: chandrasekar Mon, 23 Nov 2020 7:03 PM

అభివృద్ధికి ఓటేయండి: టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు...


గ్రేటర్‌ హైదరాబాద్‌ బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్‌ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే వాళ్లకు పట్టం కట్టాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, సామాన్య ప్రజలను సమిధలుగా చేసే మతతత్వ పార్టీలైన బీజేపీ, ఎంఐఎంలను తరిమికొట్టాలని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా, శాంతి భద్రతలకు మారుపేరుగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిందని, కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్ర రాజధానిని మతోన్మాదుల చేతిలో పెట్టొద్దన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Tags :
|
|

Advertisement