Advertisement

  • కరోనా వాక్సిన్ ట్రయల్స్ కు ఆరోగ్యవంతులైన ఔత్సహికులు కావలెను ..ఢిల్లీ ఎయిమ్స్

కరోనా వాక్సిన్ ట్రయల్స్ కు ఆరోగ్యవంతులైన ఔత్సహికులు కావలెను ..ఢిల్లీ ఎయిమ్స్

By: Sankar Sun, 19 July 2020 6:26 PM

కరోనా వాక్సిన్ ట్రయల్స్ కు ఆరోగ్యవంతులైన ఔత్సహికులు కావలెను ..ఢిల్లీ ఎయిమ్స్



దేశీయంగా తయారు చేసిన కరోనా టీకా ‘కోవ్యాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు వాలంటీర్లు కావాలని ఢిల్లీ ఎయిమ్స్ తెలిపింది. సోమవారం నుంచి ఆరోగ్యవంతులైన ఔత్సాహికుల ఎంపిక జరుగుతుందని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా ఔషధాలు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కలిసి దేశీయ కరోనా టీకా ‘కోవ్యాక్సిన్’ను రూపొందించాయి.

ఈ వ్యాక్సిన్‌ను మానవులపై మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఢిల్లీ ఎయిమ్స్‌తో సహా 12 సంస్థలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. తొలి దశ కింద దేశవ్యాప్తంగా 375 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందులో సుమారు వంద మందిపై ఎయిమ్స్ ఢిల్లీ ప్రయోగాలు జరుపనున్నది.

మరోవైపు మానవులపై కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు ఎయిమ్స్ ఎథిక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఔత్సాహికుల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు, ఇలాంటి రోగాలు లేదా కరోనా బారినపడనివారు కరోనా వ్యాక్సిన్ మానవ ప్రయోగాలకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు

Tags :
|
|
|

Advertisement