Advertisement

  • ఇక నుంచి ప్రతినెల వాలంటీర్ ఖాళీల భర్తీ...ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ఇక నుంచి ప్రతినెల వాలంటీర్ ఖాళీల భర్తీ...ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

By: Sankar Wed, 09 Dec 2020 1:08 PM

ఇక నుంచి ప్రతినెల వాలంటీర్ ఖాళీల భర్తీ...ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం


ఏపీలో నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ..ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఖాళీలను ప్రతి నెల ఒకటి నుంచి 16 తేదీల మధ్య నింపాలని ప్రభుత్వం ఆదేశించింది..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.60 లక్షల మంది వలంటీర్లు ఉండగా.. ప్రస్తుతం 7,120 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 5,154 గ్రామ వలంటీర్‌ పోస్టులు, 1,966 వార్డు వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు.

దీనితో ఈ ఖాళీల భర్తీకి కోసం అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలో ఏర్పడే ఖాళీల వివరాలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు..

Tags :

Advertisement