Advertisement

ఒకే దొంగ... 58 ఇళ్లల్లో చోరీలు

By: Dimple Wed, 09 Sept 2020 09:48 AM

ఒకే దొంగ... 58 ఇళ్లల్లో చోరీలు

చోరీలకు పాల్పడి... పబ్బం గడుపుతున్న ఓ దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. స్క్రూ డ్రైవర్‌, కటింగ్‌ ప్లేయర్‌, గునపం వంటి సాధారణ వస్తువులతోనే ఓ దొంగ మూడేళ్లలో 58 చోట్ల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. తుదకు సీసీ ఫుటేజీ నిఘాకు చిక్కి పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు సహకరించిన మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. మంగళవారం విశాఖ నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హా వెల్లడించిన ప్రకారం... విశాఖ మధురవాడ దరిలోని ఓ చర్చి పాస్టర్‌ ఇంట్లో ఆగస్టు 16న 40 తులాల బంగారం చోరీ అయినట్లు ఫిర్యాదు అందింది. ఇంట్లోని సీసీ ఫుటేజీలో నమోదైన చిత్రాలు, వేలిముద్రలను సేకరించి దర్యాప్తు చేపట్టగా నిందితుడు పలు దొంగతనాలతో సంబంధమున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్‌గా గుర్తించారు.

ప్రభాకర్‌ చిన్నతనంనుంచి చోరీలకు అలవాటుపడి.. గతంలో జైలుశిక్ష అనుభవించాడు. గన్నవరం సబ్‌ జైలు నుంచి 2017లో విడుదలయ్యాక విశాఖ వచ్చాడు. మద్దిలపాలెంలో ఉంటున్న విజయనగరంజిల్లాకు చెందిన తవిటిబాబు, నర్సీ పట్నానికి చెందిన నవీన్‌ తో పరిచయం ఏర్పడింది. నవీన్‌ తో కలిసిర రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్రభాకర్‌ దొంగిలించుకొచ్చిన నగలను తవిటి బాబు అమ్మేవాడు.

28 ఇళ్లల్లో చోరీలకు ఎంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో 4, విశాఖపట్నం రూరల్‌లో 18, పశ్చిమగోదావరి జిల్లాలో కలిపి 58 స్థావరాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ధర్యాప్తులో తేలింది. నిందితులు 111 తులాల బంగారం, రెండు కిలోల వెండి ఆభరణాలు, 5 లక్షల రూపాయల నగదును అపహరించారు. ఇలా 2017 నుంచి ఇప్పటిదాకా దొంగతనాలకు పాల్పడి పబ్బం గడుపుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. పట్టుబడిన ప్రబాకర్‌ ముఠా సభ్యులనుంచి 103 తులాల బంగారం, ఒక లక్ష 69 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :
|
|
|
|
|

Advertisement