Advertisement

  • మాస్క్ లేకపోతే జేబులు ఖాళీ అయినట్లే ..కొత్త రూల్స్ తెచ్చిన విశాఖ పోలీస్

మాస్క్ లేకపోతే జేబులు ఖాళీ అయినట్లే ..కొత్త రూల్స్ తెచ్చిన విశాఖ పోలీస్

By: Sankar Thu, 25 June 2020 11:36 AM

మాస్క్ లేకపోతే  జేబులు ఖాళీ అయినట్లే ..కొత్త రూల్స్ తెచ్చిన విశాఖ పోలీస్



ఆంధ్ర ప్రదేశ్ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది ..దేశం మొత్తంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నట్లు ప్రకటించిన ఏపీ సర్కార్ కరోనా తీవ్రతను తగ్గించేందుకు కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తుంది ..తాజాగా విశాఖపట్నంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు తెలిపారు..లేని పక్షంలో జరిమానా విధిస్తాం అని అన్నారు ..భౌతిక దూరం పాటించమని ఎంత చెప్పిన కూడా ప్రజలు సరిగా పాటించడం లేదు ..దీనితో ఫైన్ విదించాలని నిర్ణయించారు ..ఇలా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా , మాస్క్లు ధరించకుండా రోడ్లమీద తిరిగే వారిపై ఫైన్స్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు ..

నగరంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మాస్క్‌ ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ ఆర్‌.కె.మీనా తెలిపారు. నగరంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా భౌతిక దూరం పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

కాగా గడిచిన 24 గంటల్లో 497 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 10,331కి చేరాయి. ఇందులో 1,660 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి కాగా, 365 కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి సంబందించినవి. తాజాగా 187 మంది డిశ్చార్జ్‌ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,779కి చేరింది. మరో 10 మంది మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 129కి చేరింది. ఇంకా యాక్టివ్‌ కేసులు 5,423 ఉన్నాయి.

Tags :
|
|
|
|
|
|

Advertisement