Advertisement

వివో వై52ఎస్ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ లాంచ్...

By: chandrasekar Tue, 08 Dec 2020 7:28 PM

వివో వై52ఎస్ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ లాంచ్...


ప్రముఖ వివో వై52ఎస్ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ లాంచ్ చేసారు. దీనిలో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లేను దీనిలో ఉంచారు. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌ను దీనిలో అందుబాటులో ఉంది. 8 జీబీ వరకు ర్యామ్ దీనిలో ఉంది. దీనిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్‌ను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 18W ఫాస్ట్ చార్జింగ్ కూడా దీనిలో ఉంది. దీనిలో మూడు కలర్ ఆప్షన్లు కూడా ఉంది.

వివో వై52ఎస్ ధర మరియు స్పెసిఫికేషన్లు...

రెండు వేరియంట్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను 1,598 సుమారు రూ.18,100, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధరను సుమారు రూ.20,300 నిర్ణయించారు.

దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి. మోనెట్, కోరల్ సీ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.

ఈ ఫోన్ ఎప్పుడు మనదేశంలో లాంచ్ అవుతుందో తెలియలేదు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు.

యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను దీనిలో అందించారు.

ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా దీనిలో ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్ ముందువైపు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.

18W డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఇందులో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఉంచారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 185.5 గ్రాములు.

Tags :
|
|

Advertisement