Advertisement

  • వివో స్మార్ట్ ఫోన్ సరి కొత్త యూసర్ ఇంటర్ఫేస్ 'Origin OS'

వివో స్మార్ట్ ఫోన్ సరి కొత్త యూసర్ ఇంటర్ఫేస్ 'Origin OS'

By: chandrasekar Sat, 07 Nov 2020 2:06 PM

వివో స్మార్ట్ ఫోన్ సరి కొత్త యూసర్ ఇంటర్ఫేస్ 'Origin OS'


వివో తమ స్మార్ట్ ఫోన్ లో మెరుగైన యూసర్ ఇంటర్ఫేస్ అందించుటకు కొత్త లేయర్ ను విడుదల చేయనుంది. వివో సంస్థ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్ 19న జరగనున్న వివో డెవలపర్ కాన్ఫరెన్స్ లో Origin OS కస్టమ్ యూజర్ ఇంటర్ఫేస్ (UI)ను ఆ సంస్థ ప్రవేశపెట్టనుంది. ఈ వివరాలను వివో సంస్థ చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా ప్రకటించింది. ఈ మొబైల్ UIపై వివో సంవత్సరం నుంచి ప్రయోగాలు చేస్తోంది. దీన్ని వివో ఎక్స్ 50 సిరీస్‌లో మొదటిసారి అందుబాటులోకి తీసుకురానున్నారు. వివో స్మార్ట్‌ఫోన్‌లలో ప్రస్తుతం ఉన్న కస్టమ్ UI Funtouch OS స్థానాన్ని త్వరలో ఆరిజిన్ ఓఎస్ భర్తీ చేయనుంది. ఆరిజిన్ స్టూడియో బృందం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినందు వల్ల దీనికి ఆరిజిన్ అని పేరు పెట్టారు. ఆరిజిన్ OSలో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉంటాయనే వివరాలపై ప్రస్తుతం స్పష్టమైన సమాచారం లేదు. ఇది క్లీనర్‌ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్‌టచ్‌ ఓఎస్‌ కేవలం స్టాక్ ఆండ్రాయిడ్‌ ఫీచర్లకే పరిమితమైంది. కొత్త Vivo UIలో టోగుల్ స్విచ్ ఫీచర్ ఉండే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫీచర్‌తో వినియోగదారులు క్లీనర్ ఆండ్రాయిడ్ UX నుంచి మాడిఫైడ్ వర్షన్లకు సులువుగా మారే అవకాశం ఉంది.

అనతి కాలంగా చాలా స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లో విడుదలవుతున్నాయి. కావున ఇతర సంస్థలకు పోటీగా Vivo X60 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనున్న నేపథ్యంలో Origin OS గురించి ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆరిజిన్ ఓఎస్ సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ బేస్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వివో పోటీదారులకు సవాల్ విసరనుంది. ఇప్పటికే వివోకు పోటీగా ఉన్న షియోమి సంస్థకు MIUI, శామ్‌సంగ్ కంపెనీకి One UI వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌ ప్రత్యేకంగా ఉన్నాయి. వివో ఫోన్ కు కౌంటర్ పాయింట్ అనే పరిశోధన సంస్థ ఇటీవల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల పరంగా పేలవమైన రేటింగ్ ఇచ్చింది. గతేడాది మూడో త్రైమాసికం నుంచి ఈ సంవత్సరం రోండో త్రైమాసికం వరకు ఆ సంస్థ అమ్మిన స్మార్ట్‌ఫోన్లలో కేవలం 24 శాతం ఫోన్లు మాత్రమే ఆండ్రాయిడ్ 10 ఫన్‌టచ్ ఓఎస్‌ కు అప్‌డేట్ అయ్యాయి. దీంతో తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి, వారికి మెరుగైన సేవలందించడానికి సరికొత్త ఇంటర్‌ఫేస్‌ను వివో అందుబాటులోకి తీసుకురానుంది. డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కొత్త IoT, యాప్స్, గేమ్స్ వంటి వాటిని వివో అందుబాటులోకి తీసుకురానుందని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ కొత్త UI వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుందని తెలిపింది.

Tags :
|

Advertisement