Advertisement

  • వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా తీసింది

వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా తీసింది

By: chandrasekar Thu, 06 Aug 2020 3:56 PM

వర్జిన్‌ అట్లాంటిక్‌ ఎయిర్‌లైన్స్‌ దివాలా తీసింది


కరోనా మహమ్మారి రవాణా రంగాన్ని పూర్తిగా కుదిపేసిన విషయం తెలిసిందే. వర్జిన్‌ అట్లాంటిక్‌ దివాలా తీసింది. సంస్థ రక్షణార్థం అమెరికా దివాలా కోర్టును ఆశ్రయించింది.

ముఖ్యంగా విమానయాన రంగం వైరస్‌ దెబ్బకు చితికిపోయింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో దివాలా ప్రక్రియకు వెళ్లిన వర్జిన్‌ అట్లాంటిక్ అమెరికాలోనూ ఆ పనికి సిద్ధమైంది.

ఇందులో భాగంగానే అమెరికా ఫెడరల్‌ బ్యాంక్ప్స్రీ కోర్టులో చాప్టర్‌ 15ను దాఖలు చేసింది. సంస్థ రుణదాతలు దివాలా ప్రక్రియకు మద్దతునిస్తున్నారని, తిరిగి నిలదొక్కుకోగలమన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా వర్జిన్‌ అట్లాంటిక్‌ ప్రతినిధి వ్యక్తం చేశారు.

సంస్థ నిర్వహణ భారంగా మారడంతో ఇప్పటికే వందలాది ఉద్యోగులను తొలగించారు.

Tags :
|
|

Advertisement