Advertisement

  • టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్

By: chandrasekar Sat, 05 Dec 2020 9:23 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై మండిపడ్డ వీరేంద్ర సెహ్వాగ్


ఆస్ట్రేలియా టూర్ లో తొలి టీ20 మ్యాచ్‌లో ప్లేయర్స్ మార్పు పై సెహ్వాగ్ మండిపడ్డారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయాస్‌ అయ్యర్, చాహల్‌కి తుది జట్టులో చోటివ్వని విరాట్ కోహ్లీ మనీశ్ పాండే, సంజు శాంసన్‌లను టీమ్‌లోకి తీసుకున్నాడు. దాంతో ఏ కారణంతో శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేశావు? అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. తొలి మ్యాచ్‌లో మనీశ్ పాండే 2 పరుగులకే ఔటవగా సంజు శాంసన్ 23 పరుగులు చేసి వికెట్ చేజార్చుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మరి ఏ కారణంతో తొలి టీ20లో అతనిపై విరాట్ కోహ్లీ వేటు వేశాడు? ఇదే ప్రశ్నని అడిగేందుకు శ్రేయాస్ అయ్యర్‌కి ధైర్యం లేదు.

టీంలో మిడిల్ ఆర్డర్ పై సతమతమ్యావుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మరో విషయం చెప్పాలనుకుంటున్నా. టీమిండియాలో రూల్స్ అందరికీ వర్తిస్తాయి, కానీ విరాట్ కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం నిబంధనల్ని పట్టించుకోరు. అతనికిష్టమొచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు. ఆటగాళ్లపై వేటు వేస్తాడు ఫామ్‌లో లేకపోయినా రెస్ట్ తీసుకుంటాడు. ఇది తప్పు అని కోహ్లీ పై సెహ్వాగ్ మండిపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత నెం.4 బ్యాట్స్‌మెన్‌ గురించి అతిగా చర్చ జరిగింది. దాంతో ఆ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌కి వరుసగా భారత సెలెక్టర్లు అవకాశమివ్వగా వన్డే, టీ20ల్లో అతను నిలకడగా రాణించాడు. కానీ తాజాగా తొలి టీ20లో అతనిపై వేటు వేయడం ద్వారా మళ్లీ నెం.4 విషయంలో సంక్షోభం తీసుకురాబోతున్నారని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. దీని వల్ల టీం బాటింగ్ లో వుతేజం తగ్గుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.

Tags :
|
|

Advertisement