Advertisement

  • ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఇండియా వచ్చేయనున్న కోహ్లీ ...ఎందుకో తెలుసా !

ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఇండియా వచ్చేయనున్న కోహ్లీ ...ఎందుకో తెలుసా !

By: Sankar Tue, 10 Nov 2020 06:18 AM

ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఇండియా వచ్చేయనున్న కోహ్లీ ...ఎందుకో తెలుసా !


ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. తొలి టెస్టు ఆడాక భారత్‌కు పయనమవుతాడు..టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె డెలివరీ తేదీ జనవరిలో ఉంది. దీంతో అనుష్క ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు.

ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది. రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్‌ 27, 29, డిసెంబర్‌ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్‌ 4, 6, 8) బరిలోకి దిగుతుంది.

అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్‌ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు.

Tags :
|
|

Advertisement