Advertisement

  • ప్రాక్టీస్ సెషన్ తర్వాత తన అనుభవాన్ని షేర్ చేసిన విరాట్ కోహ్లీ

ప్రాక్టీస్ సెషన్ తర్వాత తన అనుభవాన్ని షేర్ చేసిన విరాట్ కోహ్లీ

By: chandrasekar Mon, 31 Aug 2020 6:11 PM

ప్రాక్టీస్ సెషన్ తర్వాత  తన అనుభవాన్ని షేర్ చేసిన విరాట్ కోహ్లీ


ఆర్సీబీ జట్టు హోం క్వారంటైన్ పూర్తి చేసుకుని మైదానంలోకి అడుగు పెట్టింది. ప్రాక్టీస్ సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ తన అనుభవాలను పంచుకున్నాడు. తాను ఊహించిన దాని కన్నా పరిస్థితి బాగుందన్నాడు. ఐదు నెలల తర్వాత బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేయాలంటే చాలా భయంవేసిందన్నాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఐపీఎల్ 2020 ఆడేందుకు గత వారం దుబాయ్‌కి వచ్చిన బెంగళూరు టీమ్ క్వారంటైన్ గడువు ముగియగానే శనివారం ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేశారు. సెషన్ తర్వాత విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని భయపడ్డానని, అయితే అనుకున్న దాని కంటే కాస్త ఈజీగానే ఉందన్నాడు.

కరోనా, లాక్‌డౌన్ సమయంలో బ్యాట్ చేతపట్టలేదు. కానీ బాడీని ఫిట్‌నెస్‌గా ఉంచుకోవడం ప్లస్ పాయింట్ అయింది. బాడీ తేలికగా అనిపిస్తే ప్రాక్టీస్ చేయడం ఈజీ. డెల్ స్టెయిన్, ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెసన్ సైతం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యారు. స్పిన్ త్రయం షాబాజ్ నదీమ్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ బాగా వేశారని’ తొలి ప్రాక్టీస్ సెషన్ తర్వాత కోహ్లీ వివరించాడు. ఫాస్ట్ బౌలర్లు ఫిట్ నెస్ సాధించి త్వరలోనే గాడిన పడతారని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో లాగ శరీరం అంతగా సహకరించడం లేదు కానీ ఊహించిన దాని కన్నా బెటర్‌గా చురుకుగా కదులుతున్నానని తన ఫిట్ నెస్ గురించి కోహ్లీ తెలిపాడు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, సిబ్బందికి కలిపి 13 మందికి కరోనా సోకడం ఆందోళన కలిగించే వార్త.



Tags :

Advertisement