Advertisement

  • ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన కింగ్ కోహ్లీ

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన కింగ్ కోహ్లీ

By: Sankar Mon, 28 Dec 2020 2:41 PM

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ గా ఎంపిక అయిన కింగ్ కోహ్లీ


ఐసీసీ అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దుమ్ము రేపాడు. ద‌శాబ్ద‌పు టెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన అత‌డు.. సోమ‌వారం ప్ర‌క‌టించిన అవార్డుల్లో ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా నిలిచి స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్ అవార్డ్ అందుకోనున్నాడు. అంతేకాదు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లినే వ‌రించింది.

టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు మాత్రం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ద‌క్కింది. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ గెలుచుకున్నాడు. టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును ఆఫ్ఘ‌నిస్థాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు.

కాగా విరాట్ కోహ్లీ 2008 లో టీమిండియాలోకి అరంగేట్రం చేసాడు ...టీంలోకి వచ్చిన కొద్దీ కాలంలోనే టీంఇండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు...సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్న టైం లో జట్టులోకి వచ్చిన కోహ్లీ సచిన్ స్థానాన్ని భర్తీ చేసాడు..ముఖ్యంగా వన్ డే క్రికెట్ లో కోహ్లీ ఆటను మరొక లెవెల్ కు తీసుకెళ్లాడు ..సచిన్ వందవ సెంచరీ చేసినప్పుడు ఇంకెవ్వరు ఆ రికార్డు కు దరిదాపుల్లోకి కూడా రాలేరు అనుకున్నారు కానీ కోహ్లీ మాత్రం ఆ అసాధ్యాన్ని అందుకేందుకు పరుగులు తీస్తున్నాడు ...ఈ డికేడ్ లో అత్యధిక సెంచరీ లు 66, అత్యధిక అర్థ సెంచరీలు 94, అత్యధిక పరుగులు ఇలా అన్ని రికార్డులు కోహ్లీ పేరిట ఉన్నాయి..

Tags :
|

Advertisement