Advertisement

  • కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే అతడిని టెస్ట్ జట్టులోకి తీసుకోలేము ...కోహ్లీ

కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే అతడిని టెస్ట్ జట్టులోకి తీసుకోలేము ...కోహ్లీ

By: Sankar Fri, 11 Dec 2020 9:48 PM

కేవలం బ్యాటింగ్ కోసం మాత్రమే అతడిని టెస్ట్ జట్టులోకి తీసుకోలేము ...కోహ్లీ


ప్రస్తుత టీం ఇండియాలో ఆల్ రౌండర్ అంటే తక్కువ గుర్తొచ్చే పేరు హార్దిక్ పాండ్య ...మెరుపు బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించే పాండ్య గాయం కారణంగా ఇటీవల బౌలింగ్ కు కొంచెం రెస్ట్ ఇచ్చాడు.దీనితో ఇటీవల జరిగిన వన్ డే , టి ట్వంటీ సిరీస్ లలో కేవలం బ్యాట్స్ మెన్ గానే బరిలోకి దిగి తన సత్తా చాటుకున్నాడ..

అయితే ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో మాత్రం పాండ్య చోటు దక్కించుకోలేకపోయాడు ..అయితే సూపర్ ఫామ్ లో ఉన్న పాండ్య ను ఎందుకు తీసుకోలేదు అని విమర్శలు వస్తున్నాయి ..అయితే వీటిపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించాడు...

టెస్టు క్రికెట్‌ అనేది ఒక భిన్నమైన గేమ్‌. కానీ అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయలేడు. ఆ విషయం మాకు కూడా తెలుసు. ఒకవేళ ఎంపిక చేస్తే బౌలర్‌ కూడా హార్దిక్‌ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే అతన్ని పరిగణించలేకపోయాం. హార్దిక్‌ కనుక టెస్టు జట్టులో ఉండి ఉంటే జట్టులో మరింత సమతుల్యం వచ్చేది. హార్దిక్‌ బౌలింగ్‌కు ఇంకా ఫిట్‌ కాలేకపోవడం వల్లే తనకు తానుగా స్వదేశానికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా సన్నద్ధ కావడానికి కూడా విశ్రాంతి అవసరమనే హార్దిక్‌ భావించాడు’ అని కోహ్లి తెలిపాడు.

Tags :
|

Advertisement