Advertisement

  • సచిన్ దగ్గర నేర్చుకున్న ఆ టెక్నిక్ వల్లనే ఈ రోజు టెస్ట్ క్రికెట్లో రాణిస్తున్నాను ..కోహ్లీ

సచిన్ దగ్గర నేర్చుకున్న ఆ టెక్నిక్ వల్లనే ఈ రోజు టెస్ట్ క్రికెట్లో రాణిస్తున్నాను ..కోహ్లీ

By: Sankar Sat, 25 July 2020 11:35 AM

సచిన్ దగ్గర నేర్చుకున్న ఆ టెక్నిక్ వల్లనే ఈ రోజు టెస్ట్ క్రికెట్లో రాణిస్తున్నాను ..కోహ్లీ



క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సలహాలు, సూచలనతోనే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగ్గా రాణించగలిగానని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. హిప్‌ అలైన్‌ మార్చుకున్న తర్వాత తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన కోహ్లి సహచర ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌తో వీడియో చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా 2014 నాటి ఇంగ్లండ్‌ టూర్‌లో బ్యాటింగ్‌ పరంగా తనకు ఎదురైన చేదు జ్ఞాపకాలు, వాటిని అధిగమించిన తీరును గుర్తు చేస్తున్నాడు..

ఇంగ్లండ్‌ టూర్‌లో హిప్‌ పొజిషన్‌ నాకెంతో సమస్యాత్మకంగా మారింది. అయినప్పటికీ నేనేం ఏం చేయాలనుకున్నానో అదే చేస్తూ కఠినంగా ముందుకు సాగాను. అయితే తొందరగానే నేను ఈ విషయాన్ని గ్రహించాను. నిజం చెప్పాలంటే అదో బాధాకరమైన విషయం. ఓ బ్యాట్స్‌మెన్‌గా కుడి వైపు తుంటి భాగాన్ని బాగా చాచినపుడు లేదా దగ్గరకు తీసుకువచ్చినపుడు మనం ప్రమాదంలో పడతామనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. అందుకే హిప్‌ పొజిషన్‌ను దృష్టిలో పెట్టుకుని.. కాస్త బ్యాలెన్స్‌ చేస్తూ బ్యాటింగ్‌ చేయడం చాలా ముఖ్యమైనది. ఇంగ్లండ్‌ టూర్‌లో నేను ఈ టెక్నిక్‌ మిస్సయ్యానని అనిపిస్తూ ఉంటుంది..

ఆ తర్వాత ముంబైలో సచిన్‌ పాజీని కలిశాను. ఫార్వర్డ్‌ ప్రెస్‌ ద్వారా ఫాస్ట్‌ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే టెక్నిక్స్‌ నేర్చుకున్నా. అదే వ్యూహాన్ని ఆసీస్‌ టూర్‌లో అమలు చేశాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు..ప్రస్తుత తరంలో దిగ్గజ ఆటగాడిగా మన్నలను అందుకుంటున్న కోహ్లీ టెస్ట్ కెరీర్ ప్రారంభంలో అంతగా రాణించలేకపోయాడు ..ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ వరుస సింగల్ డిజిట్ స్కోర్లతో దారుణంగా నిరాశపరిచాడు..అయితే ఆ తర్వాత తన లోపాలని సరిచేసుకుని టెస్ట్ క్రికెట్ లో కూడా దిగ్గజ ఆటగాడిగా మన్నలను అందుకున్నాడు ..

Tags :
|

Advertisement