Advertisement

  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌...రెండవ స్థానం కాపాడుకున్న కోహ్లీ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌...రెండవ స్థానం కాపాడుకున్న కోహ్లీ

By: Sankar Sun, 20 Dec 2020 5:07 PM

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌...రెండవ స్థానం కాపాడుకున్న కోహ్లీ


ఐసీసీ ఆదివారం బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. బ్యాటింగ్‌ విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ 901 పాయింట్లతో టాప్‌ స్థానం నిలుపుకోగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 888 పాయింట్లతో రెండో స్థానంలోనే ఉన్నాడు.

అయితే తొలి టెస్టులో మెరుగయిన ప్రదర్శన చేసి ఉన్నట్లైతే కోహ్లీ మొదటి స్థానానికి చేరుకునేవాడు ..కానీ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేయడం.. రెండో ఇన్నింగ్స్‌లో 4పరుగులకే వెనుదిరగడంతో రెండు పాయింట్లు సాధించి 888 పాయింట్లతో 2వ స్థానంలోనే ఉన్నాడు.

ఆసీస్‌తో టెస్టుకు ముందు 7వ స్థానంలో ఉన్న పుజారా ఒకస్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు..ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే పింక్‌బాల్‌ టెస్టులో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న హాజిల్‌వుడ్‌ ఏకంగా 5వ స్థానానికి చేరుకోగా.. మరో ఆసీస్‌ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ 910 పాయింట్లో అగ్రస్థానాన్ని ​కాపాడుకున్నాడు. భారత్‌ బౌలర్లలో అశ్విన్‌ ఒక స్థానం మెరుగుపరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు.. పింక్‌బాల్‌ టెస్టుకు ముందు 8వ స్థానంలో ఉన్న బుమ్రా రెండు స్థానాలు దిగజారి హోల్డర్‌తో కలిసి సంయుక్తంగా 10వ స్థానంలో నిలిచాడు

Tags :
|

Advertisement