Advertisement

  • ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్‌ మ్యాచ్ లకు దూరం

ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్‌ మ్యాచ్ లకు దూరం

By: chandrasekar Tue, 10 Nov 2020 09:56 AM

ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్‌ మ్యాచ్ లకు దూరం


ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కోహ్లీ మూడు టెస్ట్‌ మ్యాచ్ లకు దూరం కానున్నాడు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పితృత్వ సెలవులు మంజూరు చేసింది. గర్భవతి అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. దీంతో జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే రెండవ, మూడవ టెస్టుకు అతడు దూరం కానున్నాడు. అడిలైడ్‌లో తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు తిరిగి వస్తాడు. తొడకండరాల గాయం నుంచి కోలుకున్న రోహిత్‌ శర్మను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు వన్డే, టీ20 సిరీస్‌లకు అతడికి విశ్రాంతినిచ్చారు.

ఈ టూర్ లో వన్డే జట్టులో రాహుల్ కి తోడుగా అదనపు వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఉన్న ఫాస్ట్‌బౌలర్‌ ఇషాంత్‌ శర్మ పూర్తిగా కోలుకోని, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే అతన్ని టెస్టు జట్టులోకి తీసుకోనున్నారు. భుజం గాయం కారణంగా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. అతని స్థానంలో టీ నటరాజన్‌ను ఎంపిక చేశారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతుండగా గాయపడిన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా అందుబాటులో ఉండే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. భారత్ అన్నీ సిరీస్ కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది.

Tags :
|

Advertisement