Advertisement

విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన రికార్డ్

By: chandrasekar Tue, 06 Oct 2020 09:26 AM

విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన రికార్డ్


టీ20ల్లో పరుగుల వర్షం కురుస్తుంది. ఇందులో విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన రికార్డ్ సాధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టీ20ల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో 9 వేలకుపైగా పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మెన్ విరాట్. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగులు పూర్తి చేయగానే కోహ్లి 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 182 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కోహ్లి 5545 రన్స్ చేశాడు. అత్యున్నతమైన బాటింగ్ ద్వారా ఈ రికార్డు నమోదు చేసుకున్నాడు.

ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. పొట్టి ఫార్మాట్‌లో గేల్ 13,296 రన్స్ చేశాడు. 396 ఇన్నింగ్స్ ఆడిన గేల్ టీ20ల్లో 22 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు చేశాడు. ఏకంగా 978 సిక్సులు బాదాడు. టీ20ల్లో గేల్ హయ్యస్ట్ స్కోర్ 175 నాటౌట్ కావడం విశేషం. టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరేబియన్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో నిలిచాడు. 462 ఇన్నింగ్స్ ఆడిన పోలార్డ్ 10370 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడోస్థానంలో ఉన్నాడు. 366 ఇన్నింగ్స్ ఆడిన మాలిక్ పది వేల పరుగులకు 84 రన్స్ దూరంలో నిలిచాడు. 9922 రన్స్‌తో కివీస్ హిట్టర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 364 ఇన్నింగ్స్ ఆడిన మెక్‌కల్లమ్ ఏడు సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు బాదాడు. మెక్‌కల్లమ్ తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ ఉన్నారు. వేగంగా పరుగులు చేయడం వల్ల ఈ రికార్డుల్లోకి ఎక్కారు.

Tags :
|

Advertisement