Advertisement

  • అందుకే ఎబిడిని ఆరో స్థానంలో పంపించాము ..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

అందుకే ఎబిడిని ఆరో స్థానంలో పంపించాము ..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

By: Sankar Fri, 16 Oct 2020 11:13 AM

అందుకే ఎబిడిని ఆరో స్థానంలో పంపించాము ..క్లారిటీ ఇచ్చిన కోహ్లీ


కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనను ఆఖరి బంతికి ఫినిష్‌ చేశారు పంజాబ్‌. ఐతే ఈ మ్యాచ్‌లో ఏబీ డివీలియర్స్‌ ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అతడి కంటే ముందు వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబెను ఆడించారు. మ్యాచ్‌ అనంతరం విరాట్‌ కోహ్లి ఈ విషయంపై మాట్లాడాడు.

'లెఫ్ట​ అండ్‌ రైట్‌ కాంబినేషన్‌ ఉండాలనే ఏబీని ఆరవ స్థానంలో ఆడించాల్సి వచ్చింది. పంజాబ్‌లో ఇద్దరు లెగ్‌ స్పిన్నర్స్‌ ఉన్నారు కాబట్టి వారిని టార్గెట్‌ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. 170 పరుగులు చేయడం సంతృప్తిగా ఉంది. పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు చూసి 19వ ఓవర్లోనే మ్యాచ్‌ పూర్తి అవుతుందని అనుకున్నా. కానీ ఆఖరి బంతి వరకు బౌలర్లు పోరాడారు. ఆఖరి ఓవర్‌లో చాహల్‌తో ఎలాంటి చర్చ జరపలేదు' అని కోహ్లి పేర్కొన్నాడు..

కాగా పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో సాధికారికంగా ఆడింది..తొలుత బౌలింగ్ లో రాణించి ఆర్సీఐబి ని తక్కువ స్కోర్ కు కట్టడి చేసిన రాహుల్ సేన తర్వాత బ్యాటింగ్ లో కూడా అదే స్థాయిలో రాణించి సంచలన విజయం సాధించి రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుని ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది..

Tags :
|

Advertisement