Advertisement

  • ఐపీఎల్ 2020లో మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైన విరాట్ కోహ్లి

ఐపీఎల్ 2020లో మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైన విరాట్ కోహ్లి

By: chandrasekar Tue, 29 Sept 2020 12:44 PM

ఐపీఎల్ 2020లో మరోసారి బ్యాటింగ్‌లో విఫలమైన విరాట్ కోహ్లి


ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. టచ్‌లోకి రావడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన కోహ్లి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కానీ ఫించ్ (52), పడిక్కల్ (54), డివిలియర్స్ (55 నాటౌట్) రాణించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు పంజాబ్‌తో జరిగిన గేమ్‌లో కూడా కోహ్లి విఫలమయ్యాడు. ఐదు బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లి కాట్రెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫీల్డింగ్‌లోనూ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేశాడు. దీంతో సునీల్ గావస్కర్ కోహ్లి బ్యాటింగ్‌పై విమర్శలు చేయడం మధ్యలో అనుష్క శర్మ ప్రస్తావన తేవడం వివాదాస్పదమైంది.

ఐపీఎల్ 2020లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడింది. కానీ కోహ్లి 13 బంతులాడి 14 రన్స్ చేశాడు. కుదురుకుంటున్న దశలో నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా.. 5 వేల పరుగుల మార్క్‌ను చేరుకున్న రెండో ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేసి కోహ్లి గత సీజన్ నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ 7 బంతుల్లో 16 రన్స్ చేశాడు. అంతకు ముందు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 7 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 3 సిక్సులు బాదాడు. ఈ మ్యచ్ వర్షం కారణంగా నిలిచి పోయింది. గత సీజన్ నుంచి ఇప్పటి వరకూ 8 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ చేసిన 25 పరుగుల కంటే ఎక్కువ చేయకపోవడం విశేషం. గతంలో న్యూజిలాండ్ పర్యటన తర్వాత కోహ్లి ఇంత కాన్ఫిడెంట్‌తో కనిపించడం ఇదే తొలిసారని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. విరాట్ త్వరగా ఫామ్‌లోకి రావాలని, భారీ ఇన్సింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.

Tags :
|
|
|

Advertisement