Advertisement

  • రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు నేటితో పన్నెండు ఏళ్ళు

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు నేటితో పన్నెండు ఏళ్ళు

By: Sankar Tue, 18 Aug 2020 3:55 PM

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు నేటితో పన్నెండు ఏళ్ళు


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఈరోజుకి సరిగ్గా 12 ఏళ్లయ్యింది. 2008, ఆగస్టు 18న దంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

కానీ.. 22 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. 12 పరుగులకే కులశేఖర బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. అయితే.. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌ని మూడుకి మార్చుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.ఈ 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 86 టెస్టులు, 248 వన్డేలు, 81 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలోనూ 50.0 సగటు మెయింటైన్ చేస్తూ ఇప్పటికే 70 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు.

ఇందులో వన్ డే లలో 43, టెస్ట్ క్రికెట్ లో 27 సెంచరీలు ఉన్నాయి..ప్రస్తుతం క్రికెట్ లో మూడు ఫార్మటు లలో అద్భుతంగా ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేయగల ఆటగాళ్ల గురించి చర్చ వచ్చినప్పుడు ఫస్ట్ వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ. అంతలా.. క్రికెట్ ప్రపంచంపై విరాట్ కోహ్లీ తన ముద్ర వేశాడు.

Tags :

Advertisement