Advertisement

  • ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ విషయంలో ఆసియా లోనే తొలిస్థానంలో నిలిచిన కోహ్లీ

ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ విషయంలో ఆసియా లోనే తొలిస్థానంలో నిలిచిన కోహ్లీ

By: Sankar Wed, 26 Aug 2020 11:09 AM

ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ విషయంలో ఆసియా లోనే తొలిస్థానంలో నిలిచిన కోహ్లీ


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఇండియాలోనే గాక , ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీకి కోట్లలో అభిమానులు ఉన్నారు..అయితే సోషల్ మీడియాలో కూడా కోహ్లీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే..

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే విరాట్ కోహ్లీ.. రెగ్యులర్‌గా తన అప్‌డేట్స్ పెడుతుంటాడు. దాంతో.. అతని ఫాలోయర్ల సంఖ్య గత మూడేళ్ల నుంచి గణనీయంగా పెరిగింది. తాజాగా విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 75 మిలియన్లకి చేరగా.. ఆసియాలో ఈ ఘనత సాధించిన తొలి సెలెబ్రిటీగా అతను నిలిచాడు. అంతేకాకుండా.. వరల్డ్‌లోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్న అథ్లెట్స్ జాబితాలోనూ నాలుగో స్థానంలో నిలిచాడు.

పోర్చుగల్ ఫుట్‌బాలర్ రొనాల్డోకి 238 మిలియన్ ఫాలోయర్లు ఉండగా.. ఆ తర్వాత మెస్సీ, నెయ్‌మార్ జూనియర్ టాప్-3లో కొనసాగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోనూ విరాట్ కోహ్లీకి ఫాలోయర్లు ఎక్కువే. కోహ్లీని ఫేస్‌బుక్‌లో 36.9 మిలియన్ మంది అనుసరిస్తుండగా. ట్విట్టర్‌లో అతని ఫాలోయర్ల సంఖ్య 37.3 మిలియన్‌‌గా ఉండటం విశేషం. మొత్తంగా.. 150 మిలియన్ మంది విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

Tags :

Advertisement