Advertisement

  • ఆస్ట్రేలియా టూర్ లో రెండోసారి స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురి అయిన కోహ్లీ

ఆస్ట్రేలియా టూర్ లో రెండోసారి స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురి అయిన కోహ్లీ

By: Sankar Wed, 09 Dec 2020 5:12 PM

ఆస్ట్రేలియా టూర్ లో రెండోసారి స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురి అయిన కోహ్లీ


టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టి ట్వంటీ లో టీంఇండియా పోరాడి ఓడిన విషయం తెలిసిందే...కోహ్లీ పోరాడినప్పటికీ మిగతా బాట్స్మెన్ నుంచి సహకారం కరువు అవ్వడంతో టీమిండియా చివరి టి ట్వంటీ లో ఓడిపోయి ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసే అవకాశాన్ని కోల్పోయింది..

అయితే చివరి టి ట్వంటీ లో ఓటమి ఒక్కటే కాకుండా టీం ఇండియా కు మరొక షాక్ తగిలింది..భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో ఓవర్ రేట్ విషయాన్ని మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ రిఫరీ జరిమానా విధించాడు.

ఐసీసీ నిబంధనలో భాగంగా ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆసీస్‌ టూర్‌లో విరాట్‌ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి.

Tags :
|

Advertisement