Advertisement

  • చైనా ఫైటర్ జెట్ ను తైవాన్ కూల్చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్

చైనా ఫైటర్ జెట్ ను తైవాన్ కూల్చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్

By: chandrasekar Sat, 05 Sept 2020 5:36 PM

చైనా ఫైటర్ జెట్ ను తైవాన్ కూల్చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్


దక్షిణ చైనా నుంచి తైవాన్ గగనతలంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన చైనీస్ యుద్ధ విమానాన్ని కూల్చేశారని, అది గాంగ్‌క్సీ అనే ప్రాంతంలో కూలినట్టు ది జ్యుయిష్ ప్రెస్ కథనంలో ప్రకటించింది. ఓ జెట్ కూలి, పెద్ద ఎత్తున పొగ వ్యాపించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

అయితే, ఆ వీడియో ఎక్కడిది అనే విషయంఫై స్పష్టత రాలేదు. కానీ, తైవాన్ సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు చైనీస్ సుఖోయ్ సు - 35 ఫైటర్ జెట్‌ను తైవాన్ కూల్చేసిందని ప్రచారం ఆవుతోంది. అయితే, ఇది ఫేక్ వీడియో అని, తైవాన్ రక్షణ శాఖను ఉటంకిస్తూ ది డైలీ టెలిగ్రాఫ్ ఆసియా కరస్పాండెంట్ నికోలా స్మిత్ తెలిపారు.

2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం చైనాకు సుఖోయ్ యుద్ధ విమానాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను రష్యా 2019లోనే పూర్తి చేసింది. తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీ మిషన్ నిర్వహిస్తామంటూ గత నెలలో చైనా ప్రకటించింది. అయితే, అలాంటి చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని తైవాన్ కూడా హెచ్చరించింది. గత ప్రకటనల నేపథ్యంలో చైనీస్ సుఖోయ్ జెట్ కూలడంతో అది తైవాన్ కూల్చినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.

Tags :
|

Advertisement