Advertisement

  • భారత జట్టు కోచ్ పదవిని ద్రవిడ్ తిరస్కరించాడు .. వినోద్ రాయ్

భారత జట్టు కోచ్ పదవిని ద్రవిడ్ తిరస్కరించాడు .. వినోద్ రాయ్

By: Sankar Mon, 06 July 2020 8:51 PM

భారత జట్టు కోచ్ పదవిని ద్రవిడ్ తిరస్కరించాడు  .. వినోద్ రాయ్



రాహుల్ ద్రావిడ్ ఇండియన్ క్రికెట్ కు వన్నె తెచ్చిన దిగ్గజ ఆటగాడు ..కేవలం ఆటగాడిగానే గాక తన వ్యక్తిత్వంతో ఎందరో అభిమానులను సంపాదించాడు ..దాదాపు సచిన్ తో సమానమైన స్థాయి కలిగిన ద్రావిడ్ కోరుకుంటే ఇండియన్ సీనియర్ క్రికెట్ టీం కోచ్ పదవి వచ్చి వాలుతుంది ..కానీ ద్రావిడ్ దానిని కోరుకోలేదు , దానికంటే చిన్నది అయినా అండర్ 19 ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు ..అయితే టీమిండియా కోచ్ పదవి ఆఫర్ చేసిన ద్రావిడ్ సున్నితంగా దానిని తిరస్కరించాడు అని అన్నాడు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీవోఏ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ ..

తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తానని చెబుతూ కోచ్ పదవిని తిరస్కరించినట్టు తెలిపారు. ‘‘చూడండి.. ఇంట్లో ఇద్దరు పిల్లలు పెరుగుతున్నారు. భారతజట్టుతో కలిసి ప్రపంచమంతా తిరిగాను. కాబట్టి నేను పిల్లల విషయంలో శ్రద్ధ చూపించలేకపోతున్నాను. నేనిప్పుడు ఇంట్లోనే ఉండి వారికి సమయం కేటాయించాలనుకుంటున్నాను’’ అని ద్రవిడ్ తమతో చెప్పినట్టు రాయ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కోచింగ్ సామర్థ్యం పరంగా చూస్తే ద్రవిడ్, రవిశాస్త్రి, కుంబ్లేలు బెస్ట్ అని రాయ్ చెప్పుకొచ్చారు. తాము కచ్చితంగా రాహుల్‌తో మాట్లాడామని, అతడు అండర్-19 జట్టుతో కలిసిపోయాడని రాయ్ తెలిపారు. జట్టును ఎలా తీర్చిదిద్దాలనే విషయంలో అతడు రోడ్ మ్యాప్‌ను తయారు చేశాడని రాయ్ పేర్కొన్నారు. అతడు అద్భుతమైన ఫలితాలు తీసుకొస్తున్నాడని, ద్రవిడ్ చేయాల్సిన పని ఇంకేదో మిగిలి ఉందని, అది పూర్తిచేయాలని అతడు భావిస్తున్నాడని రాయ్ వివరించచారు.

Tags :
|
|

Advertisement