Advertisement

  • కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు

By: Sankar Sun, 28 June 2020 3:23 PM

కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు



కరోనా కారణంగా ప్రజలు అన్ని విధాలుగా నష్టపోవడమే కాకుండ మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది ..కరోనా వలన ఎవరైనా చనిపోతే మృత దేహాన్ని ముట్టుకోవడం కాదు కదా దాని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా ప్రజలు వణుకుతున్నారు ..సొంత కుటుంబ సభ్యులు కూడా తమకు ఎక్కడ అంటుకుంటదో అన్న భయంతో మృతదేహాన్ని తీసుకెళ్లడానికి జంకుతున్నారు .

.ఈ క్రమంలోనే కరోనా వైరస్‌తో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియల్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజాగనరం మండలం శ్రీరాంపురంలో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో గ్రామస్థులు అక్కడకు వచ్చారు. అంత్యక్రియలకు వీలు లేదంటూ ఆందోళనకు దిగారు.

ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మృతదేహాన్ని ఖననం చేసేందుకు అర్ధరాత్రి బంధువులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు... వారిని అడ్డుకున్నారు. సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్లే చనిపోయాడంటూ మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. శ్రీరాంపురం రాజానగరం పరిధిలో ఉండగా.. బొమ్మూరు పోలీసులు రావడంతో స్థానికులు వారిని నిలదీశారు

Tags :
|
|

Advertisement