Advertisement

  • హత్రాస్ కేసు ..బాధితురాలి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద

హత్రాస్ కేసు ..బాధితురాలి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద

By: Sankar Wed, 07 Oct 2020 3:59 PM

హత్రాస్ కేసు ..బాధితురాలి కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసిన గ్రామ పెద్ద


దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్‌ హత్యాచార ఘటనపై గ్రామ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో బాధితురాలు, ప్రధాన నిందితుడు చాలా కాలంగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపారని, వారి సన్నిహిత సంబంధం పట్ల బాధితురాలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పారు.

నిందితుడే బాలికకు సెల్‌ ఫోన్‌ ఇచ్చాడని, కుటుంబ సభ్యులే బాధితురాలిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. హిందూ మతంలో అలాంటి హేయమైన నేరానికి (సామూహిక లైంగికదాడి) ఎవరూ పాల్పడరని, నిందితులంతా నార్కో పరీక్షకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇతరుల నేరానికి మరో వ్యక్తి ని శిక్షించరాదని అన్నారు. నిందితులపై నేరాన్ని ముందుగా రుజువు చేయాలని కోరారు.

బాధితురాలికి నిందితుడితో సంబంధం ఉందని, దీన్ని బాధితురాలి కుటుంబం సహించలేదని ఆయన ఆరోపించారు. బాలికను కలిసేందుకు నిందితుడు రాగా పట్టరాని కోపంతో కుటుంబ సభ్యులు ఆమెపై దాడిచేశారని ఆరోపించారు. ఇక బాధితురాలు కుటుంబం, నిందితుడి మధ్య పలుమార్లు ఫోన్‌ సంభాషణలు జరిగాయని, ఈ కేసులో బాలిక సోదరుడిని పోలీసులు ప్రశ్నించాలని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ డిమాండ్‌ చేశారు.

ఇక ఈ కేసు నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామనే పేరుతో గ్రామంలో ఉన్నారని, ఇది గ్రామంలో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తుందని గ్రామ పెద్ద హథ్రాస్‌ ఎస్డీఎంకు లేఖ రాసినట్టు సమాచారం

Tags :
|
|

Advertisement