Advertisement

గ్రేటర్ వాసులకు షాకిస్తున్న నాటుకోడి ధరలు

By: Sankar Mon, 20 July 2020 7:19 PM

గ్రేటర్ వాసులకు షాకిస్తున్న నాటుకోడి ధరలు



ఆదివారం వచ్చింది అంటే చాలు నాన్ వెజ్ తినకుండా చాలా మంది ఉండలేరు ..అయితే పల్లెటూరులో చికెన్ కావాలి అంటే నాటు కోళ్లు బాగానే దొరుకుతాయి ..మాములుగా చికెన్ సెంటర్లలో దొరికితే బాయిలర్ కోళ్లు , నాటుకోడి అంత రుచి ఉండవు అందుకే సిటీ వాసుల కూడా నాటుకోళ్ల కోసం ఆసక్తి చూపుతారు ..అంతేగాక నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతుండటంతో నాజ్‌వెజ్‌ తప్పక ఉండాల్సిందే. అయితే కరోనా ప్రభావంతో నాటు కోళ్లకు కరువొచ్చింది. ఏ చికెన్‌ మార్కెట్, చికెన్‌ సెంటర్‌కు వెళ్లిన నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక వేళ నాటు కోడి దొరికినా వాటి ధరలు చూస్తే సిటీజనులు గుడ్లు తేలేస్తున్నారు..

అయితే కొందరు మాత్రం నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా నుంచి బయటపడవచ్చుననే ఉద్ధేశంతో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. నగరంలొని దాదాపు అన్ని చికెన్‌ సెంటర్‌లలో బ్రాయిల్, లేయర్‌ కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా విక్రయిస్తారు. అయితే గత నెల రోజులుగా నగరంలో నాటు కోళ్లు అందుబాటులో లేవు. గ్రామాల నుంచి కోళ్లు దిగుమతి కాకపోవడమే ఇందుకు కారణమని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లోనే నాటు కోళ్ల ధరలు రూ. 300– రూ. 350 వరకు పలుకుతున్నాయి. కొందరు వ్యాపారులు వీటిని నగరానికి తీసుకువచ్చి కిలో కోడి రూ. 500కు పైగా విక్రయిస్తున్నారు.

గ్రేటర్‌లో గత 15 రోజులుగా నాటు కోడికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. గ్రేటర్‌ ప్రజలు కరోనా బారినుంచి పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాన్‌వెజ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా బ్రాయిలర్‌ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని నాటు కోళ్లపై మొగ్గు చూపుతున్నారు. దీంతో నాటు కోడికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది అందుకే రేట్ కూడా విపరీతంగా పెరిగింది ..ఏది ఏమైనా ఈ కరోనా కష్ట కాలంలో నాటుకోడి ప్రియులకు ఇబ్బందులు తప్పేలా లేవు ..

Tags :
|
|

Advertisement