Advertisement

  • బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ ..కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ ..కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

By: Sankar Fri, 16 Oct 2020 2:32 PM

బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ ..కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం


అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ దుర్గగుడి ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ప్రారంభమైంది.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్‌లో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు..

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, ఏపీ మంత్రి శంకర్‌నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల, సీఎం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎప్పుడో నిర్మాణ పనులు పూర్తిచేసుకున్న ఈ ఫ్లైవర్ ప్రారంభానికి ముహూర్తం పెట్టినా.. వాయిదా పడుతూ వచ్చింది.. చివరిసారి కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా పాజిటివ్‌గా రావడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇక, రూ. 502 కోట్లతో 6 వరుసలతో 2.6 కి.మీ మేర ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగింది. మరోవైపు దుర్గగుడి ఫ్లైఓవర్‌తో పాటు ఏపీలో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.. మొత్తం రూ.15,592 కోట్ల పనులకు భూమి పూజలు నిర్వహించారు. 16 ప్రాజెక్టులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు.. 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులును జాతికి అంకితమిచ్చారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభంతో విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోనున్నాయి.. కాగా, అధికారికంగా ప్రారంభించకపోయినా.. ఇప్పటికే ఫ్లైఓవర్‌పై వాహనాలకు అనుమతిస్తున్నారు. ఇక, ఇవాళ అధికారికంగా ప్రారంభించారు.

Tags :
|
|

Advertisement