Advertisement

  • దసరా ఉత్సవాల కోసం కీలక నిర్ణయం తీసుకున్న దుర్గ గుడి పాలక మండలి

దసరా ఉత్సవాల కోసం కీలక నిర్ణయం తీసుకున్న దుర్గ గుడి పాలక మండలి

By: Sankar Wed, 07 Oct 2020 5:26 PM

దసరా ఉత్సవాల కోసం కీలక నిర్ణయం తీసుకున్న దుర్గ గుడి పాలక మండలి


దసరా ఉత్సవాల నిర్వహణ కోసం బెజవాడ దుర్గగుడి పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్సవాలను ఎలా నిర్వహించాలి. నిధులు ఎంతమేర కేటాయించాలి అనే విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈరోజు ఉత్సవాల నిర్వహణపై పాలకమండలి సమావేశం అయ్యింది.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే దసరా ఉత్సవాలు నిర్వహించాలని పాలకమండలి నిర్ణయించింది. అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నట్టు పాలక మండలి పేర్కొన్నది. ఇక ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 4 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించింది. గత ఏడాది రూ.8 కోట్ల రూపాయల మేర బడ్జెట్ ను కేటాయించగా, కరోనా కారణంగా ఆ బడ్జెట్ ను సగానికి తగ్గించారు.

ఆలయ కౌంటర్ లో లడ్డూ ప్రసాదం మాత్రమే అందుబాటులో ఉంటుందని పాలకమండలి పేర్కొన్నది. ఇక అమ్మవారి దర్శనం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ముందుగా ఆన్లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికీ మాత్రమే దర్శనం ఉంటుందని ఆలయ పాలక మండలం పేర్కొన్నది.

Tags :

Advertisement