Advertisement

  • కేసీఆర్‌పై విజయశాంతి సోషల్ మీడియాలో విమర్శలు

కేసీఆర్‌పై విజయశాంతి సోషల్ మీడియాలో విమర్శలు

By: chandrasekar Wed, 16 Dec 2020 09:30 AM

కేసీఆర్‌పై విజయశాంతి సోషల్ మీడియాలో విమర్శలు


తెలంగాణలో బీజేపీ హయం మొదలైందని దుబ్బాక ఎన్నికల్లోనూ మరియు జీహెచ్ఎంసీలో బీజేపీ విజృభించడంతో కెసిఆర్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారని విజయశాంతి విమర్శించారు. కెసిఆర్ తమ అజెండాలో మన ఉద్యోగాలు మనకు, మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయాలన్నీ మర్చిపోయారని ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించాయని తెలిపారు. ఇందువల్ల ఆయనకు ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు సంవత్సరాలుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇందుకుగాను రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని రాష్ట్రంలో సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని తెలిపారు. ఈ విషయాలు ప్రస్తుతం తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ మోసాలు సాగవని ముఖ్యమంత్రిగారు గమనించాలి అని తన ఫేస్‌బుక్ ఖాతాలో విజయశాంతి పంచుకున్నారు. విజయశాంతి ప్రస్తుతం బీజేపీ తీర్థం పుచ్చుకొని తెలంగాణాలో నిరుద్యోగ పరితిత్తులపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

Tags :
|

Advertisement