Advertisement

  • తెలంగాణ సీఎం కెసిఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విజయశాంతి

తెలంగాణ సీఎం కెసిఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విజయశాంతి

By: Sankar Mon, 07 Dec 2020 3:36 PM

తెలంగాణ సీఎం కెసిఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విజయశాంతి


కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరిన సినీ నటి విజయశాంతి , తెలంగాణ సీఎం కెసిఆర్ మీద సంచలనం వ్యాఖ్యలు చేసింది...తెలంగాణ ఉద్యమం కోసం “తల్లి తెలంగాణ పార్టీ “ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు... కానీ, కేసీఆర్ మొదట నా పార్టీని, తర్వాత నన్ను రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్రపన్నారని సంచలన ఆరోపణలు చేశారు.. తెలంగాణ సాధన కోసం కొట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అవినీతిపరుడుగా మారారని విమర్శించారు..

కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు రాములమ్మ.. కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది నేతలు ఆయనతో చేతులు కలిపారని ఆరోపించిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలవాలి... ఎవరు పార్టీ మారాలన్నది కూడా కేసీఆర్ నిర్ణయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, మాణిక్యం ఠాకూర్ ముందుగానే తెలంగాణకు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న విజయశాంతి.. టీఆర్ఎస్ అవినీతిని బయట పెట్టడమే ఇకపై నా కర్తవ్యం అని ప్రకటించారు..

బీజేపీలో నా పాత్ర ఏమిటన్నది పార్టీయే నిర్ణయిస్తుందన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు నేను సిద్ధం అని ప్రకటించిన ఆమె.. నా ప్రతిష్టను, ఆస్తులను బీజేపీ కోసం తాక్టట్టు పెట్టాను అన్నారు.

Tags :
|
|
|

Advertisement