Advertisement

విజయనగరం టీడీపీలో రగడ...

By: chandrasekar Tue, 15 Dec 2020 8:00 PM

విజయనగరం టీడీపీలో రగడ...


2019 ఎన్నికల్లో గీతను పక్కన పెట్టి అశోక్‌‌గజపతి రాజు కుమార్తె అధితికి అవకాశం ఇవ్వగా ఆమె కొలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గీత కొద్దిరోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్లీ టీడీపీ కార్యాలయం ప్రారంభించడంతో రచ్చ మొదలయింది. అశోక్ గజపతిరాజు బంగ్లాను కాదని మాజీ ఎమ్మెల్యే గీత పార్టీ కార్యాలయం ప్రారంభించడంతో రగడ ప్రారంభమైంది. గీత అశోక్ గజపతిరాజు వర్గంపై విమర్శలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఏ విషయము తమకు చేరడం లేదని జిల్లా కేంద్రంలో జెండా ఉనికి కోల్పోతుందనే కార్యాలయం ప్రారంభించామని అన్నారు. అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు నిర్వహిస్తామని గీత తేల్చి చెప్పారు.

ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయాయి. గీత తీరుపై అశోక్ వర్గం మండిపడుతోంది. అశోక్ వర్గం తాడో పేడో తేల్చుకునేందుకు అమరావతి వెళ్లింది. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కాదని ఇలా చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి నుంచి అశోక్‌గజపతి రాజు ఆధిక్యం కొనసాగింది. 2014 ఎన్నికల్లో మాత్రం పూసపాటి ఫ్యామిలీ కాకుండా మీసాల గీతకు టికెట్ కేటాయించారు ఆమె విజయం సాధించారు. ఈ వివాదానికి అధిష్టానం ఎలా పుల్‌స్టాప్ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అధినేత చంద్రబాబు దగ్గరే ఈ విషయం తేల్చుకోవాలని భావిస్తోంది. టీడీపీ వర్గపోరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Tags :
|
|
|

Advertisement