Advertisement

  • విజయ్ మాల్యా తన వారసులకు 40 మిలియన్ డాలర్లు బదలీ

విజయ్ మాల్యా తన వారసులకు 40 మిలియన్ డాలర్లు బదలీ

By: chandrasekar Tue, 01 Sept 2020 09:30 AM

విజయ్ మాల్యా తన వారసులకు 40 మిలియన్ డాలర్లు బదలీ


విజయ్ మాల్యా తన వారసులైన కొడుకు మరియు కూతికి 40 మిలియన్ డాలర్లు బదలీ చేసినట్లు తెలిసింది. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో సోమవారం చుక్కెదురయింది. కోర్టు ధిక్కారణ కేసులో తనను దోషిగా తేలుస్తూ 2017లో ఇచ్చిన తీర్పును పరిశీలించాలని మాల్యా పిల్ దాఖలు చేశారు. దీనిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో అప్పులు చేసిన మాల్యా వాటిని చెల్లించలేదు. అతను బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అతనిని భారత్ రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. మాల్యా దోషిగా సమర్థించుకున్న కోర్టు తాజాగా సుప్రీంకోర్టులో తిరస్కరించిన కేసు విషయానికి వస్తే తన వారసులకు 40 మిలియన్ డాలర్లను బదలీ చేయడం, కోర్టు ఆదేశాల్ని అతిక్రమించినట్లేనని గతంలో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీం సమర్థించుకుంది.

ఇంతకుమునుపు కేసులో తీర్పును ఆగస్ట్ 27వ తేదీన రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ రోజు తీర్పును వెలువరించింది. విజయ్ మాల్యా దోషి అని మరోసారి స్పష్టం చేసింది. మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వారసులకు మళ్లింపు అపెక్స్ కోర్టు 2017, మే 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్ని పునఃపరిశీలించాలని మాల్యా ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాల్యా తన ఆస్తులు, పిల్లలకు ఆస్తులను బదలీ చేయడంపై ప్రశ్నించింది. ఆఫ్‌షోర్ కంపెనీ నుండి అందుకున్న రూ.40 బిలియన్ డాలర్లను బ్యాంకుల్లో జమ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

కానీ మాల్యా మాత్రం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ ఈ 40 మిలియన్ డాలర్లను తన తనయుడు సిద్ధార్థ, కూతురు లియానా మాల్యా, తాన్యా మాల్యాలకు మళ్లించినట్లు బ్యాంకులు ఆరోపించాయి. బ్రిటన్ కంపెనీ నుండి నిధులు రూ.9,000 కోట్ల బ్యాంకు రుణం ఎగవేత కేసులో నిందితుడు విజయ్ మాల్యా బ్రిటన్‌లో తలదాచుకుంటున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్ వల్ల 2017లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బ్రిటీష్ సంస్థ డియోజియో నుండి అందుకున్న ఈ మొత్తం ద్వారా ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది. అతను రుణాలు ఎగవేతకు పాల్పడడం వల్ల బ్యాంకు కు తీవ్రనష్టాన్ని కలిగించాడు.

Tags :
|

Advertisement