Advertisement

  • బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

By: Sankar Sun, 06 Sept 2020 8:30 PM

బన్నీకి సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండకు యూత్‌లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని స్టైలింగ్, యాటిట్యూడ్ ఇలా మిగతా హీరోలకంటే భిన్నంగానే ఉంటుంది. విజయ్ స్టైలింగ్‌కు టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అంతటి వాడే ఫిదా అయిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు.

తనకూ ఓ డ్రెస్‌ను పంపించమని అప్పట్లో ఓ వేదికపై నేరుగా అడిగేశాడు కూడా బన్నీ. తాజాగా బన్నీకోసం ఈ రౌడీ హీరో ఓ గిఫ్ట్ ను పంపాడు. అల్లు అర్జున్ కు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ టీ షర్ట్.. ట్రాక్.. మరియు స్పెషల్ మాస్క్ లను కూడా పంపించాడు. విజయ్ దేవరకొండ నుండి బన్నీ అందుకున్న ఈ స్పెషల్ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక విజయ్ పూరిజగన్నాథ్ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. ఇక అల్లు అర్జున్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడింది.

Tags :
|

Advertisement