Advertisement

  • అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం

By: chandrasekar Tue, 15 Sept 2020 09:24 AM

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం


దేశవ్యాప్తంగా మళ్ళీ ఉల్లిపాయలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొరత వల్ల ధరలు పెరిగి సామాన్యులకు మరింత భారంగా మారింది. ఉల్లిపాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరోసారి సంక్షోభం ముందు నిలిచింది. సామాన్యులను కన్నీళ్లు పెట్టించే పరిస్థితి ఉంది. భారీ వర్షాల కారణంగా ఉల్లి పంటలపై తీవ్ర ప్రభావం పడటమే అందుక్కారణం. మరోవైపు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) సోమవారం, సెప్టెంబర్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది.

వేరే దేశాలకు ఉల్లి ఎగుమతులు తాము చెప్పేంత వరకు నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం స్పష్టం చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా భారత్ ఉంది. దక్షిణాసియా దేశాల వంటకాల్లో ఉల్లిపాయలను ప్రధానంగా వాడతారు. బంగ్లాదేశ్, నేపాల్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు భారత్ నుంచే ఉల్లి ఎగుమతి అవుతోంది. ఎగుమతికి అనుమతిస్తే ఉల్లిపై మరింత భారం పడుతుంది.

వర్షాల వల్ల ఉల్లికి పంటల్లో నష్టాలూ వాటిల్లింది. దేశీయ అవసరాలకు సరిపడా ఉల్లి నిల్వల కోసం కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల వాణిజ్య కేంద్రమైన లాసల్‌గావ్‌లో నెల వ్యవధిలోనే టన్ను ఉల్లిపాయల ధర మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో టన్ను ధర రూ.30 వేలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లిధర ప్రస్తుతం రూ.40గా ఉంది. ఉల్లి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉత్పత్తి అవుతోంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో వేలాది ఎకరాల్లో ఉల్లి పంట దెబ్బతింది. మిగతా రాష్ట్రాల్లో కోత ఆలస్యం కానుంది. దీంతో ఉల్లి సరఫరా పడిపోయింది. దీని ఫలితంగా నెల వ్యవధిలోనే ఉల్లి ధర మూడు రెట్లు పెరిగింది.

Tags :
|

Advertisement