Advertisement

చైనీస్ యాప్స్ బ్యాన్ ఫై నెటిజన్ల అభిప్రాయాలు

By: chandrasekar Fri, 03 July 2020 4:13 PM

చైనీస్ యాప్స్ బ్యాన్ ఫై నెటిజన్ల అభిప్రాయాలు


ఇటీవల భారత ప్రభుత్వం టిక్ టాక్, హెలో, యూసీ సహా పలు యాప్స్‌ను నిషేధించింది. దీనిపై నెటిజన్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెట్ వర్క్ 18 ప్రయత్నించింది. ఈ సర్వేలో పాల్గొన్న నెటిజన్లలో అత్యధిక శాతం మంది చైనీస్ యాప్స్ బ్యాన్ చేయడాన్ని సమర్థించారు. మరిన్ని కూడా బ్యాన్ చేయాలనే ప్రశ్నకు ఔనని సమాధానం ఇచ్చారు. మరిన్ని చైనీస్ యాప్స్ బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు

చైనీస్ యాప్స్‌ను బ్యాన్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? అన్న ప్రశ్నకు ఔను: 89.3%, కాదు: 7.9%, చెప్పలేను: 2.7%.

ఇతర చైనీస్ యాప్స్‌ను కూడా బ్యాన్ చేయాలంటారా? ప్రశ్నకు ఔను: 86.8%, కాదు: 8.6%, చెప్పలేను: 4.5%.

చైనీస్ యాప్స్ మన డేటాను తస్కరించి, మన మీద నిఘా పెడుతున్నాయని నమ్ముతారా? ఔను: 77.5%, కాదు: 8.5%, చెప్పలేను: 13.8%.

భారత్ నిబంధనలను అంగీకరిస్తే ఆ యాప్స్ మీద బ్యాన్ ఎత్తేయడానికి అంగీకరిస్తారా? ఔను: 31.4%, కాదు: 57.1%, చెప్పలేను: 11.4%.

చైనీస్ కంపెనీలైన హువాయ్, జీటీఈ లాంటి వాటి నుంచి టెలికం ఎక్విప్‌మెంట్ వాడడాన్ని భారత్ కచ్చితంగా బ్యాన్ అమలు చేయాలంటారా? ఔను: 80.2%, కాదు: 11.3%, చెప్పలేను: 8.4%.

బ్యాన్ ఎత్తివేస్తే మళ్లీ చైనీస్ యాప్స్ వినియోగిస్తారా? ఔను: 14.5%, కాదు: 76.7%, చెప్పలేను: 8.8%.

‘మేడిన్ చైనా’ లేబుల్స్ ‌ను స్పష్టంగా కనిపించేలా ఈ కామర్స్ కంపెనీలు అమలు చేయాలా? ఔను: 71.7%, కాదు: 16.1%, చెప్పలేను: 12% గా సమాధానం యిచ్చారు.

Tags :
|
|
|

Advertisement