Advertisement

  • ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

By: Sankar Thu, 25 June 2020 9:34 PM

ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 సంవత్సరాలు నిండిన సందర్భంగా అప్పటి రోజుల్ని, పరిస్థితుల్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంతో పాటు అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను నెమరు వేసుకున్నారు. 21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీలో ఎక్కువ కాలం పాటు జైలులోనే ఉన్న వెంకయ్య.. అప్పటి తన సహచరులు, నాయలకులతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

21 నెలల సుదీర్ఘకాలం ఆ చట్టవిరుద్ధమైన నిర్బంధంలో, పౌరులు జీవన హక్కుతో సహా అన్ని ప్రాథమిక హక్కులను కోల్పోయారు. లక్షలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అమాయక పౌరులు జైళ్లలో బంధించబడ్డారు. అది అత్యవసర కాలం. నేను 3 వేర్వేరు జైళ్ళలో పదిహేడున్నర నెలలు జైలు శిక్ష అనుభవించాను.

ప్రజల హక్కులను అనాగరికంగా హరించడాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగిన జాతీయ తిరుగుబాటులో పాలు పంచుకున్నాను. చట్టవిరుద్ధమైన, చట్టబద్ధమైన చర్యల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మహోద్యమం నడిపాం. పదిహేడున్నర నెలల జైలు జీవితం అనంతరం 1977 జనవరిలో జైలు నుండి విడుదలయ్యాను’’ అని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

Tags :
|

Advertisement