Advertisement

  • ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్

By: chandrasekar Mon, 28 Sept 2020 5:43 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాళులు అర్పించారు. కోట్లాది ప్రేక్షకులను తన గానంతో అలరించిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతిపై ఇప్పటికే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులు అర్పించారు. తాజాగా ఈయన మృతిపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నివాళులు అర్పించారు. గాయకుడిగా ఎంత ఉన్నతంగా ఎదిగినా ఎపుడు ఒదిగి ఉండేవారని బిగ్‌‌బీ కొనియాడారు. బాలుకి ఆ దేవుడు ఎంతో అద్భుతమైన తేనెలొలుకు గొంతు ఇచ్చాడు. ఇపుడా గొంతు మూగ బోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు 40,000 పాటలను పాడి ఉన్నత స్థానాన్ని అధిరోహించారు.

బాలు గాన ప్రతిభ కేవలం దక్షిణాది ప్రేక్షకులనే కాదు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిందని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు కరోనా మహ్మామ్మారి బారిన పడిన ఈయన త్వరగా కోలుకుంటారనుకున్నాను. కానీ ఆ దేవుడు మాత్రం ఆయన గానం పై మక్కువతో తన దగ్గరికి పిలుపించుకున్నాడంటూ భావోద్వేగానికి గురయ్యారు. కరోనా వల్ల ఇష్టమైన వ్యక్తులు మన నుండి దూరం అవుతున్నారన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయానికొస్తే గత నెల 5వ తేదిన కరోనాతో చెన్నై ఎంజీఎం హాస్పిటిల్‌లో జాయిన్ అయిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా పోరాడుతూ ఈనెల 25న తుది శ్వాస విడిశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వయసు 74 సంవత్సరాలు. గత 52 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. పైనున్న ఆ దేవుడికి ఆ గాన గంధుర్వుడి గాన మాధుర్యం వినిలానిపించిందేమో.. ఆయన దగ్గరకు పిలిపించుకున్నట్టున్నారు. ఆయన మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసినట్టైయింది. అంతేకాదు తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ఆయనకు ముందు తర్వాత అనేంతగా తెలుగుతో పాటు దక్షిణాదితో పాటు మొత్తంగా భారతీయ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసారు. ఈయన గాన ప్రతిభ దక్షిణాది ప్రేక్షకులనే కాదు ఉత్తరాది ప్రేక్షకులను సైతం కదిలించింది.ఆయనకు పాటకు ఉత్తరాది, దక్షిణాది భేదం లేకుండా అందరినీ అలరించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో అయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

Tags :

Advertisement