Advertisement

  • జూన్ నెల‌లో 42 శాతం ప‌డిపోయిన‌ వాహ‌నాల రిజిస్ట్రేషన్లు

జూన్ నెల‌లో 42 శాతం ప‌డిపోయిన‌ వాహ‌నాల రిజిస్ట్రేషన్లు

By: chandrasekar Wed, 22 July 2020 2:24 PM

జూన్ నెల‌లో 42 శాతం ప‌డిపోయిన‌ వాహ‌నాల రిజిస్ట్రేషన్లు


ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఆటోమొబైల్ అసోసియేష‌న్ (ఎఫ్ఏడీఏ) వాహ‌నాల రిజిస్ట్రేషన్లు జూన్ నెల‌లో 42 శాతం ప‌డిపోయిన‌ట్లు తెలిపింది. నెల‌ల వారీగా వాహ‌నాల రిజిస్ట్రేషన్లు వివ‌రాల‌ను ఎఫ్ఏడీఏ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది.

ఏడాది ప్రాతిప‌దిక‌న ద్విచ‌క్ర వాహ‌నాల‌ విభాగంలో 40.92 శాతం, త్రిచ‌క్ర వాహ‌నాల విభాగంలో 75.43 శాతం, వాణిజ్య వాహ‌నాల విభాగంలో 83.83 శాతం, ప్ర‌యాణికుల వాహ‌నాల విభాగంలో 38.34 శాతం ప‌డిపోయింది. కాగా ట్రాక్ట‌ర్ల రిజిస్ట్రేషన్లు 10.86 శాతం పెరిగిన‌ట్లు ఎఫ్ఏడీఏ తెలిపింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో మే నెల‌తో పొల్చితే వాహ‌నాల రిజిస్ట్రేషన్లు కాస్త పెరిగాయి. గ్రామీణ మార్కెట్లో బలమైన డిమాండ్ ఉన్న ట్రాక్టర్ల అమ్మకాలు రిజిస్ట్రేషన్ల రిక‌వ‌రీకి పెంపుద‌ల‌కు దారితీసింది.

రాబోయే నెల‌ల్లో వాహ‌నాల రిజిస్ట్రేషన్ల వృద్ది జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఆటో రంగం పున‌రుత్తేజానికి ప్ర‌భుత్వ స‌హ‌కారం ఎంతో ఉప‌యుక్తం కానుంద‌ని ఎఫ్ఏడీఏ పేర్కొంది.

Tags :

Advertisement